మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం: కేటీఆర్‌..

వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాంగణాలు నెలకొల్పాయి. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం. లైఫ్‌సైన్స్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్‌ అత్యుత్తమ వేదికగా మారింది. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.