ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ సాఫ్ట్‌ అయ్యారనుకుంటున్నారా..?లోపల ఒరిజినల్‌ అలాగే ఉంది…మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

R9TELUGUNEWS.COM.
ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ సాఫ్ట్‌ అయ్యారనుకుంటున్నారా..?.

లోపల ఒరిజినల్‌ అలాగే ఉంది అంటూ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లలో ఎవరూ ఊహించని విధంగా కామారెడ్డి జిల్లాని అభివృద్ది చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు..3,400 గ్రామపంచాయతీలని కొత్తగా ఏర్పాటు చేసింది కేసీఆర్‌. ప్రతి పేదవాడి మొహంలో సంతోషం చూడాడనికి సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తెలంగాణలో నడుస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయండని అడుగుతున్నారు. వెకిలి మాటాలు మాట్లాడేవాళ్లు ఎక్కువైండ్రు. కేసీఆర్‌ మీద మాట్లాడితే ఊరుకోం. ఏప్రిల్‌ 27కి ఇరవై ఏళ్లు నిండినయి. ఒక ప్రాంతీయ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం ఎంతొ కష్టం..