తులం బంగారమిస్తే తీసుకోండి:..మంత్రి కేటీఆర్

మునుగోడు ఉపఎన్నిక ప్రజల మీద బలవంతంగా రుద్దిన ఎన్నిక అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్‌లో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లు నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు రాజీనామా చేసి అక్రమంగా వచ్చిన డబ్బుతో గెలవాలని చూస్తున్నారు. అవసరమైతే ఇంటికి తులం బంగారం ఇచ్చి అయినా గెలుస్తామని ఆయన ధైర్యం. అక్కాచెల్లెళ్లకి ఒకటే చెబుతున్నా.. తులం బంగారమిస్తే బరాబర్‌ తీసుకోండి…..

మునుగోడు నియోజకవర్గం.
…………………………..
గెల్చిన రోజు నుంచే బీజేపీ తో అంట కాగాడు రాజగోపాల్ రెడ్డి..
18 వేల కోట్లకు అమ్ముడు పోయి బలవంతంగా ఉప ఎన్నికను తెచ్చిన ఘనుడు రాజగోపాల్ రెడ్డి..మునుగోడు ప్రజలను బీజేపీ కి తాకట్టు పెట్టిండు రాజగోపాల్ రెడ్డి….
ఏనాడు ప్రజా సమస్యలపై నోరు మెదపలేదు రాజగోపాల్ రెడ్డి….
చేనేత కార్మికులను విస్మరించాడు…
డబ్బులు పెట్టి ప్రజలను అంగడి సరుకుల కొందాం అని కుట్ర చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి….
రైతులకు 24 గంటలు ఉచితంగా కరంట్ అందిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు….
అత్యధికంగా వరి దిగుబడులు సాధించి, నల్గొండ జిల్లా ఘన కీర్తిని సాధించింది….వ్యవసాయాన్ని పండుగలా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ ..
అన్నదాతలు ఆలోచన చెయ్యాలి….
ఆనాడు ఉద్యమ సమయంలో నిను ఫ్లోరైడ్ బాధలను చూసినా… ఫ్లోరైడ్ బాధితులను చూసి,ఆనాడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి….ఫ్లోరైడ్ తో మనుష్యులు జీవచ్చావాళ్ళా మారారు..
జానారెడ్డి, ఉత్తమ్,లాంటి పెద్ద పెద్ద నాయకులు వున్నా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదు..కిమ్మన లేదు…..
ఈనాడు ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షిత నది జలాలను అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్…
ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సాగు నీరు కూడా అందించేందుకు
పాలమూరు -డిండి ఎత్తి పోతల పథకాలను నిర్మిస్తున్నారు…..ముఖ్యమంత్రి గారి నాయకత్వం లో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నది…అందుకే బీజేపీ వాళ్లకు కన్ను కుట్టింది.. కుట్రలు మొదలు పెట్టారు….
ఇవ్వాళ వృద్ధులు , వికలాంగులు ఆసరా పెన్షలతో ఆత్మభిమానం తో జీవిస్తున్నారు……
కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం తో ఆడ పిల్లల పెళ్లిళ్లు సంబురంగా జరుగుతున్నాయి……
మేన మామ లాగా ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారు…అండగా వుంటున్నారు…..పేదల సంతోషం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు..
దళిత బంధు లాగా, భౌష్యత్తులో ఇతర వర్గాల వారికి కూడా అన్ని విధాలా అందుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు….
నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని నరేంద్ర మోడీ మోసం చేసాడు…..జన్ ధన్ ఖాతా లో డబ్బులు వేస్త అని మోసం చేసాడు మోడీ..18 వేల కోట్లను రాజగోపాల్ రెడ్డి అనే దొంగ అకౌంట్ లో వేసాడు మోడీ….
రాజగోపాల్ రెడ్డి కి ఓటేస్తే సిలిండర్ ధర 2 వేలు అవుతుంది… జాగ్రత్త ప్రజలారా బీజేపీ కి సరైన బుద్ది చెప్పాలి….చేనేతకు సబ్సిడీ లను అందిస్తున్నాం… నేతన్నలకు చేయిత పథకం ద్వారా చేయిత అందిస్తున్నాం……మరో రెండు చేనేత క్లస్టర్ లను కూడా మంజూరు చేస్తాం…….
గట్టుప్పల్ ను కొత్త మండలంగా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్…చండూర్ ను
రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తాం……
అభివృద్ధి కి పట్టం కడుతూ trs కి ఓటెయ్యండి ..కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించండి…..