అమిత్ షా-నరేంద్రమోదీ అహంకారానికి చెంపదెబ్బ కొట్టిన మునుగోడు ప్రజలకు హాట్సాఫ్… మంత్రి కేటీఆర్

*కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతు…

*మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి.. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు*

మునుగోడు trs అభ్యర్థి ఎన్నిక కోసం కష్టపడ్డ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు

2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపించిన నల్గొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా

నల్గొండ లో 12కు 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాం..

రాజకీయాల్లో హత్యలు ఉండవు…ఆత్మహత్యలే అంటారు

*అమిత్ షా-నరేంద్రమోదీ అహంకారానికి చెంపదెబ్బ కొట్టిన మునుగోడు ప్రజలకు హాట్సాఫ్*

మునుగోడులో బీజేపీ అహంకారాన్ని తొక్కి, చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు

బీజేపీ ఢిల్లీ నుంచి 100ల కోట్ల డబ్బుల సంచులతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించింది

ఈటల రాజేందర్ పీఏ రూ.90లక్షలతో దొరికాడు..

హవాలా డబ్బు రూ.2.5 కోట్లతో వివేక్ కు సంబంధించిన వ్యక్తి దొరికాడు..

రూ.75 కోట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ట్రాన్స్ఫర్ చేశారు..

ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా… వివేక్ ను హవాలా ట్రాన్స్ఫర్ వాదిగా పెట్టుకుంటున్నారు..

15 కంపెనీల CRPF, 40 IT టీమ్ లను దింపి, కేంద్రం దండయాత్రకు వచ్చినట్టు వచ్చింది

వందల కోట్లు దొరికినట్లు మేము ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తే… ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది

ధనవంతులైన ఈటల, రాజగోపాల్ రెడ్డి వల్లనే హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో… ఎన్నిక ధనమయమైంది, కలుషితమైంది

మేము దుబ్బాక, హుజురాబాద్ లో ఓడిపోయాం… హుందాగా మా ఓటమిని ఒప్పుకున్నాం

అదే మునుగోడులో బీజేపీ ఓడిపోతే… ఇతరులపై నిందలు వేస్తున్నారు

ఇప్పటికైనా బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి…

కారును పోలిన గుర్తులకు దాదాపు 6000 ఓట్లు పోయాయి

ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు EVM లను కూడా తారుమారు చేశాం అని చెప్పుకున్నారు

*గెలుపైనా… ఓటమైనా… స్థితప్రజ్ఞతతో ఒకేలా తీసుకుంటాం*

పలివెలలో బీజేపీ వాళ్లే మాపై దాడి చేసి, వాళ్ళకే దెబ్బలు తగిలినట్టు డ్రామాలు

*బండి సంజయ్ చిల్లర డ్రామాలను ప్రజలు పట్టించుకోలేదు..