రేవంత్ రెడ్డి కుటుంబం నడుపుతున్న పాలనే ప్రజా పాలనా?
తిరుపతి రెడ్డికి ఏ అధికారం లేకపోయినా.. కలెక్టర్, ఎస్పీల సమక్షంలో కొడంగల్‌లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
రేవంత్ అల్లుడి కోసం, ఆయన పార్ట్నర్గా ఉన్న కంపెనీ కోసం, కొడంగల్‌లోని లగచర్లలో గిరిజనుల భూములను లాక్కున్నారు.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా(యూనిటీ) మాల్ టెండర్లలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్ల లో కావాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ, అనుమానాస్పద నిబంధనలతో ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేట్ డెవలపర్‌కు లబ్ధి చేకూరుస్తున్నదని ఆయన విమర్శించారు. తక్షణమే ఆ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టుపై తుది నిర్ణయాలు తీసుకోకముందే, ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధు ల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి విలువ కాకుండా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.2,059.81 కోట్లు అని, ఇందులో రేవంత్ సర్కార్ భారీ అక్రమాలకు పాల్ప డుతున్నదని లేఖలో ప్రస్తావించారు. రా యదుర్గ్లోని అత్యంత విలువైన 6.30 ఎ కరాల స్థలంలో, 27లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును త లపెట్టారని.. ఇందుకోసం సుమారు రూ.202కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలిపారు.