రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను ఎంతో మందిని చూసాం. BRSవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లను ఎంతో మందిని చూశామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ”రేవంత్‌రెడ్డిలా అహంకారంతో మాట్లాడిన నాయకులను ఎంతో మందిని చూసినం. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోపల బొందపెట్టే సంగతి తర్వాత.. ముందు హామీలను వంద రోజుల్లో నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ”రేవంత్ లెక్కనే ఎందరో మఖలో పుట్టి పుబ్బలో పోతదని బీఆర్ఎస్పై నీలిగిండ్రు.. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది’ అని ఆయన అన్నారు..తెలంగాణ జెండాను ఎందుకు బొందపెడ్తవ్? .. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతయ్.. రేవంత్ కాంగ్రెస్‌కు ఏక్ నాథ్ షిండేగా మారతడు.. రేవంత్ రక్తం బీజేపీదే.. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు.. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అదానీతో అలయ్‌బలయ్ చేసుకున్నడు.. అదానీ, రేవంత్ రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని గతంతో చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్‌గా మారారని విమర్శించారు..