టికెట్ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్..

KTR Tweet on BRS Candidates List : టికెట్​ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్

స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​కు.. మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత ట్విటర్​ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. టికెట్లు దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం కల్పిస్తామని కేటీఆర్​ తెలిపారు. మరోవైపు దమ్మున్న సీఎం-ధైర్యం గల ప్రకటన అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్​ చేశారు…

హరీష్ రావుపై మైనంపల్లి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదన్నారు. హరీష్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో మంత్రి హరీష్ రావుకు అండగా నిలబడతానని పేర్కొన్నారు.

కాగా, మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు కొడుకు మైనంపల్లి రోహిత్ రావు ఆశిస్తున్నారు. అయితే, ఇక్కడ హరీష్ రావు మనిషిగా పేరొందిన మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే మరోసారి టికెట్ కన్ఫార్మ్ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే మైనంపల్లి మంత్రి హరీష్ రావుపై సీరియస్ అయ్యారు.

తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.. ఆన్ని విక్టర్ వేదికగా మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యక్తులను ఖండించారు..