ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ..

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రోజ్‌గార్ మేళా పచ్చి దగా.. యువతను మరోసారి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. ‘నమో’ అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందన్నారు. మోసపుచ్చే హామీలు పక్కన పెట్టి.. నిబద్ధతతో నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నారు.. మరి 16 కోట్ల ఉద్యోగాల హామీ సంగతేంది? అని ఆయన ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేంద్ర ప్రభుత్వం… మేళా పేరుతో 75 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని యువత గమనిస్తోందన్నారు. కేంద్రంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.