పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్..

పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్..

రేపు కేసీఆర్‌ను కలిసి అక్టోబర్ 16న జనగాంలో జరగబోయే సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న పొన్నాల లక్ష్మయ్య..

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కలిశారు.. హైదరాబాద్ లోని పొన్నాల నివాసానికి స్వయంగా కేటీఆర్ వెళ్లి ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేసిన నేపథ్యంలో తమ పార్టీలోకి రావాల్సిందిగా కేటీఆర్ స్వ‌యంగా ఆహ్వానించారు. నిన్న పొన్నాల రాజీనామా చేసిన తర్వాతనే కేటీఆర్ స్పందిస్తూ.. పొన్నాల తమ పార్టీలోకి వస్తానంటే సగౌరవంగా తానే ఆహ్వానిస్తానని, పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కెటిఆర్ స్వ‌యంగా పొన్నాల ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానం ప‌లికారు.. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పొన్నాల వంటి సీనియర్ నేతను తమ పార్టీలోకి ఆహ్వానించామన్నారు.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.. పార్టీలో ఆయనకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామన్నారు.. ఈ నెల 16వ తేదిన జనగాంలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరనున్నారని కేటీఆర్ తెలిపారు..