కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు….. కేటీఆర్..

*నల్గొండలో మీడియాతో మాట్లాడిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR- కీలక వ్యాఖ్యలు:*

గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది…

కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు…

డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే “కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు” అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు.

ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది – ప్రజల పాలన కాదు.

*సీఎం రేవంత్ రెడ్డి ని అడుగుతున్నా:*

SLBC టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది.

మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు.

అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్ప లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది.

నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు.

కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారు.

ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు.

మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది.

తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి?

మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి.

మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు.

రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి.

ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి….

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కమీషన్ల కోసం కక్కుర్తి పడటంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని కేటీఆర్‌ ఆరోపించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు ఆ నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోలేదని.. కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. వట్టెం పంప్ హౌస్ మునగడం, పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోవడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపలేదని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి 3 నెలలు గడుస్తుంటే అందులో నుంచి శవాలను తీసే సోయి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. అసలు ఆ టన్నెల్ ఎందుకు కూలిందో చెప్పే తెలివి ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదని అన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఈ మూడు నెలల కాలంలో మంగళ గ్రహం నుంచి కూడా మనుషులను తిరిగి తెచ్చేదని చెప్పారు. కానీ ఈ చేత కానీ ప్రభుత్వానికి టన్నెల్ నుంచి చనిపోయిన వారి శవాలు తెచ్చే శక్తి లేదని విమర్శించారు.

కమిటీల పేరుతో, విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ఆరు గ్యారంటీల అమలును పక్కనపెడదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్న కోటి 68లక్షల మంది ఆడబిడ్డల తరపున, తులం బంగారం ఏది అని అడుగుతున్న ఆడపిల్లల తల్లిదండ్రుల తరపున, నెలకు 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడిస్తావని అడుగుతున్న పెద్దమనుషుల తరపున ప్రభుత్వంతో బీఆర్ఎస్ కొట్లాడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతి హామీని అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హామీలు అమలుచేయకుండా డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు…

కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రయోగంగా చూపించే బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు వచ్చాయని మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూదిపింజల్లా తేలిపోతాయని స్పష్టం చేశారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద తమకు అపార గౌరవం ఉందని.. ముమ్మాటికీ ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడుతాడన్న నమ్మకం ఉందన్నారు..