కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదు..!!

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హన్మకొండయ పీఎస్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఐ పీసీ 504,505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించాడని కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు గులాబీ క్షేత్రస్థాయి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి….

పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత హన్మకొండలో ఫిర్యాదు చేసి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 504, 505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ నేతలకు ఇచ్చారని కేటీఆర్ ఆరోపణలు చేశారు.