రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్‌ పర్యటన..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ పర్యటించనున్నారు.

ముందుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్న మెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనర సింహారావు తదితరులు పాల్గొంటారు…