మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలువు,, బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్‌…

బీజేపీ నేత బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏం అభివృద్ధి చేసింది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్‌కు ఏమీ రాదని ఎద్దేవాచేశారు. కరీంనగర్‌కు కనీసం ఓ గుడి అయినా తెచ్చావా అని ప్రశ్నించారు. మూడేళ్లలో మతం పిచ్చి కడుపు నింపదని, బండి సంజయ్ యువతను చెడగొడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు…
బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. క‌రీంన‌గ‌ర్‌ను ఒక ల‌క్ష్మీన‌గ‌రంగా సీఎం చూస్తారు. ఇక్క‌డ ప్రారంభించే ప్ర‌తి ప‌ని విజ‌య‌వంతం అవుతుంద‌ని కేసీఆర్ న‌మ్ముతారు. మే 17, 2001న సింహ‌గ‌ర్జ‌న స‌భ పెట్టి తెలంగాణ సాధ‌న‌కు నాంది ప‌లికారు. తెలంగాణ వ‌చ్చింది. అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాక‌ముందు రూ. 200 పెన్ష‌న్‌ ఉండే. ఇప్పుడు ఆస‌రా పెన్ష‌న్ల కింద రూ. 2016లు ఇస్తున్నాం. ఆస‌రా పెన్ష‌న్లు పెద్ద మ‌న‌షుల్లో ఆత్మ‌గౌర‌వం తీసుకొచ్చింది. బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం మ‌న‌ది మాత్ర‌మే. భ‌ర్త‌ల చేత నిరాద‌ర‌ణ‌కు గురైన మ‌హిళ‌ల‌కు సైతం పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. దివ్యాంగుల‌కు రూ. 3,016 ఇస్తున్నాం. కులం, మ‌తంతో సంబంధం లేకుండా 18 ఏండ్లు నిండిన అమ్మాయిల‌కు క‌ల్యాణ‌లక్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాలు అమ‌లు చేసి ల‌క్షా నూట ప‌ద‌హారులు ఇస్తున్నామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు…