బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి మద్ధతుగా మేమూ ఉంటాం… కేటీఆర్‌.

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి మద్ధతుగా ఉంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

R9TELUGUNEWS.COM.
అతడు రాజకీయాల్లోకి వస్తాడనే భయంతో సోనూపై ఇటీవల దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారంటూ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిలో భాగంగానే సోనూసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు చేశారని, అయితే తాము సోనూకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో జరిగిన కోవిడ్‌-19 వారియర్స్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా మనవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని తెలిపారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారని పేర్కొన్నారు.