సర్కారు వారి బడుల్లో పెరిగిన విద్యార్థుల నమోదు సంఖ్య …ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌..

రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ప్రభుత్వ బడులపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరిగిందని అన్నారు…రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య రెట్టింపు అవడం తనకెంతో ఆనందాన్నిస్తున్నదంటూ ట్వీట్‌ చేశారు…విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అధికారుల బృందాన్ని మంత్రి అభినందించారు. ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది 61,129 మంది విద్యార్థులు ప్రైవేట్‌ సూళ్లను వదిలి సరారు బడుల్లో చేరారు. మొత్తం 1,69,280 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ వార్త పత్రికలో ప్రచురితమైన కథనాన్ని మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌తో పాటు పంచుకొన్నారు.