ఇలాగే వదిలెయ్యకండి రా, బీజేపీ బాబులూ.. పిచ్చిముదిరి బండికి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో మరి.. మంత్రి కేటీఆర్..
సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్ ఫాంహౌస్లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. పూజల అనంతరం కాళేశ్వరం పోయి వాటిని ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు’అని సంజయ్ శనివారం ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయగా ఆయనను ఎద్దేవా చేస్తూ కేటీఆర్ రీట్వీట్ చేశారు..
లవంగంగారిని ఇలాగే వదిలెయ్యకండి రా, బీజేపీ బాబులూ.. పిచ్చిముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదం అన్నారు…ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’అని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ తెలుగులో ట్వీట్ చేశారు…