పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి…!
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.
ఇది కేవలం ఒక తీర్పు కాదు… అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ.
ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే — ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?
ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సరైన సమయంలో సమాధానం చెబుతారు.
..
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని కేటీఆర్ అభివర్ణించారు. ఇది కేవలం తీర్పు కాదు.. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థను ఉపయోగించే ఉదాహరణ అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను లాభాల కోసం మార్చుకుంటే.. స్పీకర్ దానికి ఆమోద ముద్ర వేస్తే.. ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసానికి దెబ్బ అని అన్నారు..