అధికారి వెకిలి కామెంట్ లపై కేటీఆర్ ఆవేదన..

అధికారి వెకిలి కామెంట్స్పై కేటీఆర్ ఆవేదన TS: USలో భారత విద్యార్థిని జాహ్నవి మృతిపై పోలీసులు జోక్లు చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాహ్నవి మృతిపై SPDకి చెందిన పోలీసు అధికారి ఆమె ప్రాణాలకు విలువే లేదని చులకనగా మాట్లాడటం దారుణం. అవి పూర్తిగా ఖండించదగిన వ్యాఖ్యలు. అతడి మాటలకు తీవ్ర కలత చెందా. ఈ ఘటనపై భారతదేశంలోని US రాయబారి అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలి’ అని ట్వీట్ చేశారు.