ఈ ఎన్నికల్లోనే కేటీఆర్ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి…మిమ్మల్ని అడ్డుకునేదెవరు…వైఎస్ షర్మిలా..

మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్..వైఎస్ షర్మిలా..

బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు?.

ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి.మిమ్మల్ని అడ్డుకునేదెవరు.

నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే..

మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే..

ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి..మీ సీటు మహిళకు ఇవ్వండి.

మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించండి.

బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపండి.

మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు

మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు

నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది మీరే.

మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరే

మహిళా కమీషన్ ఉందన్న సంగతే మర్చిపోయారు.

శ్రీకాంత చారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదు.

మీ చెల్లి కవితమ్మ ఓడిపోతే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారు.

మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు..మీ కుటుంబం మీద ప్రేమ.

మీకు సామాన్య ప్రజల్ని ప్రేమించే సత్తాలేదు.

మాటలతో చిత్తశుద్ధి నిరూపణ కాదు..చేతలతోనే అవుతుంది.

119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువని ఎన్నికల సంఘం చెప్తోంది.

33 శాతం లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వండి.

గజ్వేల్ ,సిద్దిపేట,సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి..

దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయండి.

అప్పుడు నమ్ముతాం మహిళా బిల్లు మీ పోరాట ఫలితమేనని..!

మహిళల పట్ల మీకు ఎంతో చిత్తశుద్ధి ఉందని..!

మీవి అవకాశవాద రాజకీయాలు కాదని..!

దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలి.