ఏం కొనేటట్టు లేం….! ఏం తినేటట్టు లేం..!.. ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు…

*ఏం కొనేట్టు లేదు ఏం తినట్లేదు…

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తు న్నాయి. వీటికి తోడుగా కూరగాయల ధరలు ఇదే బాట పట్టాయి. ‘ఏమి తినాలో.. ఏమి కొనాలో అర్థం కావడం ‘లేదు’ అని పేద, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.. మార్కెట్లో నాలుగు రోజుల క్రితం ఉన్న కూరగాయల ధరలకు ధరలకు పోల్చితే చాలా వ్యత్యాసం కన బడుతోంది. రూ.20 నుంచి రూ.49కు పెరిగిన కిలో టమోట ప్రస్తుత ధర రూ.100. అదే విధంగా రూ. 85 పలికిన కిలో మిరప కాయల ధర రూ.120, సొరకాయ రూ.10 నుంచి రూ.40కు చేరింది. కిలో చొప్పున దొండ కాయలు రూ.35 నుంచి రూ.70కు, బెండకాయలు రూ.45 నుంచి రూ.60కు, దోసకాయలు రూ.30 నుంచి రూ. 60కు, బీన్స్ రూ.50 నుంచి రూ. 80కు, కాకరకాయ రూ.50 నుంచి రూ.70కు, బంగాళ దుంపలు రూ.30 నుంచి రూ.50 కు, మునక్కాయలు రూ.35 నుంచి రూ.50కు, వంకాయలు రూ.40కు, గోంగూర, తోటకూర ఒక్కొక్క కట్ట రూ.5 నుంచి ప్రస్తుతం రూ.15కు పెరిగింది. ఆఖరుకు ఒక్కో కొత్తిమీర కట్ట రూ. 30గా ఉంది. కోడిగుడ్డు రూ.3 నుంచి రూ.5.50/ 6.00 పలుకుతోంది. ఇక, నాటుకోడి గుడ్డు ధర అయితే వారం రోజుల క్రితం రూ.15 కాగా, ప్రస్తుతం రూ.25. చికెన్ ధరలు కూడా కిలో రూ.270.అయ్యింది…. రోజురోజుకీ పెరుగుతున్న ధరలను చూసి పేద మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.. పెరిగిన ధరలను తగ్గించి సామాన్యులకి అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు..