జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం..m

హైదరాబాద్:జూన్ 21
నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది….