33 రోజులు పాటు దీవిలో….

క్యూబాకు చెందిన ముగ్గురు పడవలో సముద్రంలో షికారుకు వెళ్లారు…సముద్రంలో అలల తాకిడి తీవ్రంగా ఉండటం వల్ల పడవ బోల్తా పడింది..

ఒకటి.రెండు రోజులు కాదు సుమారు 33 రోజులు పాటు దీవిలో గడిపిన యువత….. దొరికింది తింటూ జీవనం సాగించారు.. ఈ ఘటన
క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు.. పడవలో సముద్రంలోకి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువ కావడం వల్ల వారు ప్రయాణిస్తున్న పడవ బొల్తా పడింది. దీంతో ఆ ముగ్గురు బతుకు జీవుడా అనుకుంటూ.. చేతికి అందిన వస్తువులను పట్టుకుని సమీపంలోని దీవి వరకు ఈదుకుంటూ వెళ్లిపోయారు. అయితే, అది మనుషులు జీవించని బహమాన్ దీవుల్లోని అతి చిన్న ద్వీపం అంగుయిలా కే అని తెలిసి షాకయ్యారు. కానీ, అటుగా ఏమైనా ఓడలు, విమానాలు వస్తే సాయం అడిగవచ్చని బావించారు. పైగా ముగ్గురు ఉన్నారు కాబట్టి.. ఎలాగోలా రెండు మూడు రోజులు గడిపేద్దాం అనుకున్నారు..అయితే, వారితో తెచ్చుకున్న ఆహారం మొత్తం మూడు రోజుల్లోనే ఖాళీ అయిపోయింది. అప్పుడే తెలిసింది.. ఇక దీవిలో జీవించడం కష్టమని తిండి దొరక్క చావాల్సిందే అనుకున్నారు. అయితే, ఆ దీవిలో కనిపించిన కొబ్బరి చెట్లు వారిలో ఆశలు చిగురింపజేశాయి. మొదట్లో కొబ్బరి బొండాల్లో నీరు, కొబ్బరిని తిని కాలాయాపన చేశారు. రోజులు గడిచేకొద్ది వారిలో నీరసం బాగా పెరిగిపోయింది. కొబ్బరి బొండాలు ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తున్నాయేగానీ.. ఆకలి తీర్చడం లేదు. దీంతో సముద్రంలో చేపలను పట్టేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలించలేదు. వేరే మార్గం లేక పంది కొక్కులు సైజులో ఉండే ఎలుకలను పట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు నత్త గుల్లలను తినేవారు. వాటినే వండుకుని తింటూ కాలాయాపన చేశారు…అలా రోజులు గడిచాయేగానీ.. అలా 33 రోజులు కాలం గడిచిపోయింది. ఫిబ్రవరి 8న అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి అటుగా ఎగురుతూ వచ్చింది. దీంతో ఆ ముగ్గురు సాయం కోసం అడిగారు. పైలట్ వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. దీంతో ఆ దీవి వద్దకు హెలికాప్టర్‌ను పంపి ఆ ముగ్గురికి నీళ్లు, ఆహారాన్ని అందించారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అదే రోజు రక్షించలేకపోయారు. వారితో మాట్లాడేందుకు వీలుగా ఒక రేడియా వాకీ టాకీని అందించారు. ఫిబ్రవరి 9న రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించింది. అనంతరం వారిని హాస్పిటల్‌కు తరలించారు. వారికి ఎలాంటి గాయాలు తగల్లేదని, ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు..