లాల్‌ సలాం’ ట్విటర్‌ రివ్యూ..

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ ” లాల్ సలాం “. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఐశ్వర్య మరియు రజిని డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్, విజేత రాజశేఖర్ వంటి వారు కీలక పాత్రలలో వహించారు. ఇక జైలర్ వంటి సూపర్ హిట్ సినిమా అనంతరం రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా నేడు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ రానే వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ అతిధి పాత్రలో నటించాడు. ఇక ఈ మూవీ ఇప్పటికే 50 వేల టికెట్ల అమ్ముడుపోయాయి. బుక్ మై షో లోనే 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది ఈ మూవీ…

నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై

దర్శకత్వం : ఐశ్వర్య రజనీకాంత్

నిర్మాత: సుభాస్కరన్

సంగీత దర్శకుడు: A.R. రెహమాన్

సినిమాటోగ్రఫీ: విష్ణు రంగసామి

ఎడిటింగ్: బి. ప్రవీణ్ బాస్కర్

సంబంధిత లింక్స్: ట్రైలర్..

కథ:

కసుమూరు అనే గ్రామంలో గురు (విష్ణు విశాల్) మరియు సంషుద్దీన్ (విక్రాంత్) ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విషాద సంఘటన వారిని దూరం చేసి, వారిని బద్ద ప్రత్యర్థులుగా మార్చింది. ముంబయికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి మొయిదీన్ భాయ్ (రజినీకాంత్)కి గురు తో మరియు గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కసుమూరు గ్రామస్థులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు సినిమా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత సంఘటనలు ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి తీవ్రతరం కావడం, మొయిదీన్ భాయ్ ప్రమేయం, యువకులు ఆ సమస్యను తీర్చగలరా? లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి

ప్లస్ పాయింట్స్:

విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. తను చక్కని నటనను ప్రదర్శించాడు. పల్లెటూరి వాతావరణం మరియు మరికొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించబడ్డాయి.

విక్రాంత్ నటనకు బాగానే ఉంది. విక్రాంత్ తండ్రి పాత్రలో రజనీకాంత్ తన మేనరిజమ్స్, మంచి డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

జీవితా రాజశేఖర్ తన నటనతో ఆకట్టుకుంది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

కథాంశం మరియు దాని స్లో స్క్రీన్‌ప్లే సినిమాకి అతి పెద్ద సమస్యలు. ఐశ్వర్య రజనీకాంత్ ప్రేక్షకులకు అందించడానికి ఉద్దేశించిన సందేశం అంతగా ఆకట్టుకోదు. అంతేకాక తను చెప్పదలచుకున్న కథ చాలా పాత సినిమాలలో కనిపిస్తుంది. డైరెక్టర్ గా మరియు స్క్రీన్ రైటర్‌గా, ఆమె స్క్రిప్ట్ రైటర్ విష్ణు రంగసామిని మరింత ఎమోషన్స్ తో నింపమని చెప్పి, మరింత ఎఫెక్టివ్ గా చెప్పవచ్చు. కానీ అలా జరగలేదు.

సినిమాలో ఎమోషన్ సీన్స్ అంతగా ప్రభావం చూపవు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోవడం తో వాటి ప్రభావాన్ని మరింత తగ్గించాయి.

డబ్బింగ్ సెలెక్షన్ కారణంగా, ఇతర నటీనటులు తెలుగు ఆడియెన్స్ కి తెలియక పోవడం మరొక కారణం గా సినిమాకి సగటు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంతో కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. హీరోయిన్ అనంతిక, కపిల్ దేవ్ మరియు నిరోషాలను చేర్చుకోవడంతో కథనానికి కాస్త తక్కువ విలువను జోడించినట్లు ఉంటుంది..