laal singh chaddha review, Aamir Khan:
నటీనటులు : ఆమీర్ ఖాన్,
నాగ చైతన్య,
కరీనా కపూర్,
మోనా సింగ్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: సత్యజిత్
పాండేసంగీతం: తనుజ్ టికు
ఎడిటర్: హేమంతి సర్కార్..
నిడివిచివరి మాట : లాజిక్ దూరంగా ’
లాల్ సింగ్ చడ్డా’రేటింగ్ : 2/5..
దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir khan) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). 1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ (Advait Chandan) దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్ (Kareena Kapoor) కథానాయిక. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు…
కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..
లాల్ సింగ్ చడ్డా మూవీని దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించాడు. కథ మాత్రం హాలీవుడ్ చిత్రం ’ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కించాడు. దాన్ని ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు అతుల్ కులకర్ణి సరైన విధానంలో తీర్చిదిద్దలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా హీరో చిన్నప్పుడు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జన్సీని ఎత్తివేస్తున్నట్టు ప్రకటిస్తారు. ఇక ఎమర్జన్సీ ఎత్తివేసింది 1977లో. ఇక అపుడు హీరో ఎంత లేదన్న 5 యేళ్ల పిల్లాడుగా చూపిస్తారు. అంతేకాదు 1983లో మన దేశం కపిల్ దేవ్ ఆధ్వర్యంలో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినపుడు కూడా హీరో అదే ఏజ్‌లో కనిపిస్తాడు. ఆ తర్వాత 1984లో అప్పట్లో స్వర్ణ దేవాలయంపై జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్.. ఇందిరా గాంధీ హత్య జరిగిపుడు కూడా హీరో 6 యేళ్ల బాలుడుగా చూపించడం పెద్ద మైనస్. 1977 నుంచి 84 వరకు అంటే 6 యేళ్ల పిల్లాడు 13 యేళ్లైనా ఉండాలి. అది దర్శకుడు, రచయత,హీరో ఎలా మిసయ్యారన్నది పెద్ద ప్రశ్న. ఈ సినిమాను దర్శకుడు అప్పట్లో భారతదేశంలో జరిగిన వివిధ సంఘటనలు, ముఖ్యంగా మండల్ కమిషన్, సోమనాథ్ టూ అయోధ్య అద్వానీ రథయాత్ర, ఆ తర్వాత 1993లో ముంబైలో సీరియల్ బాంబ్ బ్లాస్టులు వంటి కథ ప్రకారం చక్కగా అల్లుకుంటూ వెళ్లాడు. మొత్తంగా 84 వరకు చిన్న పిల్లాడుగా చూపించినా.. 89 వచ్చే వరకు డిగ్రీ చదువుతున్నట్టు చూపించాడు. మొత్తంగా కథ నేటివిటీకి తగ్గట్టు బాగానే అల్లుకున్నా స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు.మొత్తంగా అద్వైత్ చందన్ ఈ సినిమాతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడనే చెప్పాలి…
కథ…
‘లైఫ్ వాజ్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ..
యూ నెవర్ నో.. వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్’అనే విషయం చుట్టూ అల్లిన కథ ఇది..ఇదో బయోపిక్ లా అనిపిస్తుంది. ఎక్కడో ..ఎవరి జీవితంలో జరిగిన కథను తెరకెక్కించారామో అని డౌట్ వస్తుంది. లాల్ సింగ్ చద్దా(అమీర్ ఖాన్) ట్రైన్ లో అపరిచితులతో తన జీవితాన్ని చెప్తూండగా ప్రారంభం అవుతుంది. లాల్ కు పుట్టుకతో కాస్తంత తక్కువ ఐక్యూ. దానికి తోడు వెన్నెముక బలంగా లేకపోవడంతో సరిగ్గా నడవలేని పరిస్దితి, కాళ్లకు సపోర్ట్‌గా బ్రేసెస్ వాడుతూంటాడు. తన స్కూల్ లో అందరూ చిన్న చూపు చూస్తూంటే ..ఆత్మ న్యూనతా భావంతో జీవిస్తూంటాడు. అయితే మంచి వాడు.. మనస్సులో ఏమి పెట్టుకోడు.. కుళ్లు, కల్మషం అతనిలో ఉండదు. అతనికి ఎవరూ స్నేహితులు ఉండరు. అప్పుడు రూప (కరీనా కపూర్) పరిచయం కావటం..ఆమె ప్రోత్సాహంతో జీవితంలో ముందుకు వెళ్తూంటాడు. తల్లి,స్నేహితురాలు సహకారంతో జీవితంలో ఒక్కో స్టెప్ దాటడం మొదలెడతాడు. నడవేలేని ఈ కుర్రాడు ఆటల్లో రాణిస్తాడు. సైన్యంలో చేరుతాడు. అక్కడ బాలరాజు( నాగచైతన్య) పరిచయంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది ఏమిటి… లాల్ చివరకు జీవితంలో ఏ స్దాయికి వెళ్ళాడు. రూపతో అతని స్నేహం ప్రేమగా మారిందా… చివరకు ఏమైంది వంటి విషయాలు