చైనాకు షాక్.. లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ వైమానిక స్థావరాన్ని నిర్మించబోతున్న భారత్..

దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి చైనా ఎప్పటికప్పడూ ఏదొక కంత్రీ ఆలోచన చేస్తూనే ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల బలోపేతం కోసం ఆర్మీకి మరింత వెసులుబాటు కనిపించేలా సౌకర్యాలను కల్పిస్తోంది.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లడఖ్‌లోని న్యోమాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ వైమానిక స్థావరాన్ని నిర్మించబోతోంది. జమ్మూలోని దేవక్ వంతెనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై భారత్, చైనాల మధ్య నిరంతర ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఈ ఫైటర్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో చైనాకు భారత్‌ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. BRO చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి వచ్చే రెండు లేదా మూడు సంవత్సరాలలో చైనాకు భారత్ గట్టిగా సమాధానం చెబుతుందని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం 3488 కిలోమీటర్ల ఎల్‌ఏసీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానికంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

కేవలం రెండు మూడేళ్లలో రూ.11 వేల కోట్లతోకేవలం రెండు మూడేళ్లలో రూ.11 వేల కోట్లతో 295 ప్రాజెక్టులు పూర్తి చేశామని లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాలతో పోల్చిన BRO చీఫ్ భారతదేశం కంటే ముందుగా LAC వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధికి చైనా ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. దశాబ్దం క్రితం ఈ ప్రాంతంలో అభివృద్ధి గురించి మన ప్రభుత్వాలు ఆలోచించి ఉన్నట్లు అయితే.. ఇప్పటి పరిస్థితి మరింత బాగుండేదని.. భారత్ కు కాస్త డిఫెన్స్‌గా ఉండేదన్నారు.