ల‌ద్దాఖ్‌లోని ష్యోక్ న‌దిలో పడిన ఆర్మీ వాహ‌నం…ఏడుగురు మంది జ‌వాన్లు మృతి..

జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ వాహ‌నం అదుపు త‌ప్పి, ల‌ద్దాఖ్‌లోని ష్యోక్ న‌దిలో ప‌డిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఏడుగురు మంది జ‌వాన్లు మృతి చెందారు. మిగ‌తా జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ”ప‌ర్తాపూర్ క్యాంప్ నుంచి 26 మంది జ‌వాన్లు వాహ‌నంలో బ‌య‌ల్దేరారు. ష్యోక్ న‌ది ద‌గ్గ‌ర ఆ వాహ‌నం స్కిడ్ అయి.. న‌దిలో ప‌డిపోయింది. ఏడుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగ‌తా జ‌వాన్లు గాయాల పాల‌య్యారు” అని ఆర్మీ అధికారులూ తెలిపేరు…ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను ఆర్మీ ఫీల్డ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని ఆర్మీ పేర్కొంది. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు ఆర్మీ పేర్కొంది. తీవ్రంగా గాయ‌ప‌డి, ఇబ్బందులున్న వారిని ఎయిర్ అంబులెన్స్‌లో వెస్ట్ర‌న్ క‌మాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని ఆర్మీ పేర్కొంది…