తెలుగు రాష్ట్రాల్లో మిస్సైన మహిళ ఎందరో పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం..!!

*తెలుగు రాష్ట్రాల్లో మిస్సైన మహిళ ఎందరో పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం*

*ఢిల్లీ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. *2019 నుంచి 2021 వరకు ఏపీలో 22,278 మంది మహిళలు, 7,928 మంది బాలికల ఆచూకీ దొరకలేదని కేంద్రం వివరించింది. ఇక తెలంగాణలో 34,495 మంది మహిళలు, 8,066 మంది బాలికలు* మిస్ అయ్యారని పేర్కొంది. మిస్సింగ్స్పై ఇటీవల జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి.