లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం.. భారత్‌ నిర్ణయంతో షాక్ అయినా మాల్దీవుల ప్రభుత్వం..!

కేంద్రం రెడీ అయ్యింది. త్వరలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తారు. అవసరమైతే నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను మూసేసి చైనాకు చెక్‌ పెట్టే వ్యూహాన్ని కూడా రెడీ చేస్తున్నారు..

పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహించాలని భారత్ చూస్తున్నప్పటికీ, మినీకాయ్ దీవుల్లో వాణిజ్య విమానాలతో పాటు యుద్ధ విమానాలతో సహా మిలిటరీ విమానాలను నడపగలిగేలా కొత్త విమానాశ్రయంను (India Plans New Airport in Minicoy) అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది…
డ్రాగన్‌ కుట్రలో భాగంగా భారత్‌తో కయ్యానికి దిగిన మాల్దీవులకు చుక్కలు కన్పిస్తున్నాయి. మాల్దీవులకు పోటీగా లక్షద్వీవ్‌ను అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌ చేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. త్వరలో అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తారు. అవసరమైతే నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను మూసేసి చైనాకు చెక్‌ పెట్టే వ్యూహాన్ని కూడా రెడీ చేస్తున్నారు. భారత్‌ బ్యాన్‌తో టూరిస్టులను తమ దేశానికి పంపించాలని చైనా ప్రభుత్వాన్ని….నైన్‌ డిగ్రీ ఛానెల్‌ను భారత్ మూసేస్తే చైనా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలకు వాణిజ్యం ఆగిపోతుంది. భారత సముద్రజలాల్లో ఈ మార్గం ఉండడంతో ఎన్నో ప్లస్‌పాయింట్లు ఉన్నాయి. చైనాతో యుద్దపరిస్థితులు ఏర్పడితే డ్రాగన్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. భారత్ ఎత్తుగడలను మాల్దీవుల ప్రభుత్వం వెంటనే గమనించింది.

నరేంద్రమోడీ గురించి ఇండియా గురించి అవహేళనగా మాట్లాడిన కారణంగా ఆ దేశానికి భారత్ నుండి టూరిస్టు ప్యాకేజీలు రద్దయిపోతున్నాయి.!!