బాలకృష్ణ భార్యపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. బస్సులో డబ్బులు తీసుకొని పారిపోయిందంటూ వ్యాఖ్యలు..

చంద్రబాబుకి బెయల్ వస్తుందో రాదో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబుని అరెస్టు పట్ల నందమూరి కుటుంబ సభ్యులు వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే లక్ష్మీపార్వతి.. బాలకృష్ణ భార్యపై ఒకప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

పూర్తి విషయంలోకి వెళ్తే జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు లక్ష్మీపార్వతి వెల్లడించారు. అటువంటి ప్రభుత్వంపై బాలకృష్ణ ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. హిందూపూర్ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాళ్లని బాలకృష్ణ కనీసం పట్టించుకోవడం లేదు. ఆ నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేసి బాధలు చెప్పుకుంటున్నారు. విజయవాడ వచ్చినప్పుడు తనని కలసి జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలులు వివరిస్తున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

lakshmi parvathi key comments saying that balakrishnas wife
అలాంటి హిందూపూర్ ప్రజలు నుండి గతంలో బాలకృష్ణ పిఏ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో బాలకృష్ణ భార్య బస్ ఎక్కి పారిపోయింది..అని అప్పట్లో వార్తలు రాలేదా అని ప్రశ్నించారు. శవాన్ని ఇంట్లో పెట్టినపుడు ఆనాడు కేసుల్లో ఇరుకోవాల్సిన నిన్ను… కాపాడిన వైఎస్ కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడటం పద్ధతి కాదు అంటూ బాలకృష్ణ పై లక్ష్మీపార్వతి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.