లంచం పంపకాల్లో తేడాతో బిహార్‌ రాష్ట్రంలో నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు.!!..

బిహార్‌ రాష్ట్రంలో నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు…

నేరాలను, ఘోరాలను అరికడుతూ ప్రజలను రక్షించడం పోలీసుల బాధ్యత. అలానే దేశ రక్షణ కోసం ఎందరో పోలీసులు ప్రాణాలు అర్పించారు. చాలా మంది పోలీసులు నిజాయితీగా, నిబద్ధతగా విధులు నిర్వహిస్తూ ప్రజల మదిలో ప్రత్యేక స్థానం పొందారు. అయితే కొందరు మాత్రం లంచాల కోసం ప్రజలను జలగళ్లా పట్టి పీడిస్తున్నారు. అలా వచ్చిన అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో లంచాల విషయంలో పోలీసులు మధ్య ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘర్షణే బిహార్ లో చోటుచేసుకుంది. లంచం వాటాల్లో తేడాలు రావడంతో నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు పొట్టుపొట్టున కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

బిహార్‌ – నలంద జిల్లాలోని సోహార్సే పోలీస్ స్టేషన్లోని ఇద్దరు పోలీసులు, ఒక కేసుకు సంబంధించి వచ్చిన సొమ్మును పంచుకునే విషయంలో గొడవ తలెత్తి నడిరోడ్డుపై కొట్టుకున్నారు…

. దీంతో ఇద్దరూ ఖాకీ చొక్కాలు పట్టుకొని మరీ ఒకరినొకరు తొసుకున్నారు. అటుగా వెళ్తున్న స్థానికులు.. ఆ పోలీసులు చుట్టు గుమిగూడారు.

స్థానికులు విడిపించే ప్రయత్నం చేసిన ఆ పోలీసులు ఇద్దరు తగ్గలేదు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిస్తే.. మిమ్మల్ని సస్పెండ్ చేస్తారని స్థానికులు హెచ్చరించిన ఆ ఇద్దరు పట్టించుకోలేదు. వారి గొడవ ఎక్కడి వరకు వెళ్లిందంటే..పరస్పరం మెడలు పట్టుకునే వరకు దారి తీసింది. గొడవ పెద్దది అవుతుండటంతో స్థానికులు సర్థి చెప్పి ..చివరకు విడిపించారు. అయితే ఈ ఖాకీలు ఫైట్ ను అక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్లో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇక ఈ ఘటనపై నలంద జిల్లా పోలీస్ అధికారులు స్పందించారు..ఇద్దరు పోలీసులను పిలిపించినట్లు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆ ఇద్దరు కానిస్టేబుల్ పై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ నిర్ణయంపై ఆ ఇద్దరి పోలీసులను ప్రదీప్ కుమార్ యాదవ్, వికాస్ గోస్వామిగా గుర్తించారు. ఇద్దరూ రాహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని డయల్ 112 బృందంలో సేవలందిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. పోలీసులు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వారిని సస్పెండ్ కాకుండా..శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.