పులి లేచి వస్తోంది బీఆర్ఎస్..తమ వద్ద బోను, వల ఉన్నాయని, పులిని తమ కార్యకర్తలు చెట్టుకు వేలాడదీస్తం.. సీఎం రేవంత్ రెడ్డి..

లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో పడుకున్న పులి లేచి వస్తోందని బీఆర్ఎస్ చెబుతోందని..తాను కూడా దానికోసమే చూస్తున్నానని అన్నారు. తమ వద్ద బోను, వల ఉన్నాయని, పులిని తమ కార్యకర్తలు చెట్టుకు వేలాడదీస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జాడ లేకుండా చేస్తామని తెలిపారు. ఆ పార్టీని 100 మీటర్ల లోతున గొయ్యి తీసి పాతిపెడతానని అన్నారు. తన పర్యటన ముగింపు సందర్భంగా శనివారం లండన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.

“ఎన్నికల తర్వాత ఆ పార్టీ చూద్దామన్నా కనిపించదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరిస్తూ ప్రజలు తీర్పునిచ్చినా ఆ నాయకులకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత నాదే. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చూపుతాం. ఇంట్లో పడుకున్న పులి లేచి వస్తోందట. నేను కూడా దానికోసమే చూస్తున్నానని, మాద్ద బోను, వల ఉన్నాయి. పులిని మా కార్యకర్తలు చెట్టుకు వేలాడదీస్తారు.” అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు..