లండన్‌లో మండుతున్న ఎండలు….

లండన్(London) లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించిన సైనిక కవాతులో సైనికులు స్పృహ తప్పి పడిపోయారు. ‘ట్రూపింగ్‌ ది కలర్‌’(trapping the colour) పరేడ్ రిహార్సల్స్ సందర్భంగా ప్రిన్స్‌ విలియం ఎదుటే ఈ ఘటన జరగడం గమనార్హం. 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం, తీవ్ర అలసటకు గురికావడంతో అస్వస్థతకు గురయ్యారు.
‘ట్రూపింగ్‌ ది కలర్‌’ అనేది ఏటా నిర్వహించే పరేడ్‌. చక్రవర్తి అధికారిక పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో(june) ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం సన్నాహక పరేడ్‌లన్నీ పూర్తయ్యాయి. జూన్‌ 17న కింగ్‌ ఛార్లెస్‌(King Charles) 3 ఎదుట ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ అసలు పరేడ్‌ జరగనుంది……