లంకె బిందెల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపింది..

భూదాన్ పోచంపల్లి: పిల్లాయిపల్లిలో లంకె బిందెల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలోని తుమ్మలచెరువు నుండి అక్రమార్కులు గత కొన్ని నెలలుగా అధికారుల కళ్లు గప్పి యధేచ్చగా మట్టిని తవ్వి లైసెన్స్ లేని అనధికార ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు.తాజాగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న మట్టి తవ్వకాల్లో వారం రోజుల క్రితం జేసిబితో మట్టి తవ్వుతుండగా 6 లంకె బిందెలు బయట పడ్డాయనీ విశ్వసనీయ సమాచారం .అందులో ఏ వెండి,బంగారు వస్తువులు ఏమి ఉన్నాయో తెలియదు కానీ సదరు వ్యాపారులు విషయాన్ని బయటకు రానివ్వకుండా గోప్యతగా ఉంచి వాటిని దాచారు.సూదిని మూట కడితే దాగని చందంగా విషయం మండల వ్యాప్తంగా లంకె బిందెల వ్యవహారం కలకలం రేపింది.విషయం వెలుగులోకి రాగానే సదరు వ్యక్తులు ఖాళీ ఇత్తడి 4 బిందెలు దొరికాయని బయట పెట్టారు మట్టి అక్రమార్కులు.అధికారులు విచారిస్తే గానీ వాస్తవాలు తెలియవని గ్రామస్తులు కోరుతున్నారు.