లతా మంగేష్కర్ మృతిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు.

R9TELUGUNEWS.COM:
లెజెండరీ సింగర్‌, ఇండియన్‌ నైటింగెల్‌, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ ఉదయం కన్నుముశారు. 92 ఏళ్ల లతాజీ జనవరి 11న కొవిడ్ (Covid) స్వల్ప లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేరారు…ఆమె వయసు దృష్ట్యా ఐసీయూలోనే ఉంచి చికిత్స కొనసాగించారు వైద్యులు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నాం లతాజీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తూ ఈరోజు ఉదయం గాన కోకిల తుది శ్వాస విడిచారు…

లతా మంగేష్కర్ మరణించారన్న వార్త తన గుండెను ముక్కలు చేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా లతాజీకి నివాళి అర్పించిన ఆయన ‘ప్రపంచంలో ఉన్న లతా మంగేష్కర్‌ అభిమానులందరికీ ఇది శరాఘాతం లాంటి వార్త. మన దేశ గొప్పదనం అన్నారు..

లతామంగేష్కర్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయ్యారు…లతా తుది శ్వాస విడిచారని తెలిసిన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ”ఎన్నో రకాల ఎమోషన్స్‌తో దీదీ పాటలు అలరించాయి. కొన్ని దశాబ్దాల కాలంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సేవలందిస్తూ ఎప్పటికప్పుడు వచ్చిన మార్పులను చూశారు లతా. భారతదేశ అభివృద్ధి, ఎదుగుదలపై ఎప్పుడూ మక్కువ చూపేవారు. ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాకం ఎగరాలని, దేశం అభివృద్ధి చాలా స్ట్రాంగ్‌గా జరగాలని కోరుకునేవారు. నాపై దీదీ చూపించిన అపారమైన ప్రేమను గౌరవంగా భావిస్తున్నాను. లతా దీదీ ఇకలేరని తెలియగానే నా తోటి భారతీయులతో పాటు నేను ఎంతో బాధపడ్డాను. ఓం శాంతి” అంటూ ట్వీట్ పెట్టారు మోదీ….

లతామంగేష్కర్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌, గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని కేసీఆర్‌ అన్నారు. లత భారతీయ సినీ, సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని సీఎం కొనియాడారు. లతామంగేష్కర్ కుటుంబీకులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు…

లతామంగేష్కర్‌ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె తన మధుర గాత్రంతో అభిమానుల హృదయాల్లో నిలిచారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను ఆమె సంపాదించుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు…

లతా మంగేష్కర్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్‌..
‘లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు…

లతా మంగేష్కర్ మృతిపట్ల భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు…

భారతరత్న లతా మంగేష్కర్‌ మృతిపట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. లతా మంగేష్కర్‌ అసాధారణ జీవితాన్ని గడిపారని.. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు….

లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం….
ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత అభిమానులకు దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతాజీ మరణం తీరని లోటు అని అన్నారు. లతాజీ అందించిన అద్భుతమైన పాటల రూపంలో ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుందన్న మంత్రి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు..