ఎల్బీనగర్ చైతన్య పురి పిఎస్ పరిధిలో వాహనాల తనిఖీల్లో భారీగా డబ్బులు..!

Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. ప్రజల్లో కూడా పార్టీలపై ఆసక్తి పెరిగింది. ఇక నోటిఫికేషన్ వెలువడటంతో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఇక నుంచి ప్రజలు 50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలంటే ఆధారాలు ఉంచుకోవాలి. ఆస్పత్రి చెల్లింపుల కోసమైతే రోగి రిపోర్టులు, శుభకార్యాల కోసమైతే సంబంధిత ఆధారాలు తప్పనిసరి. వస్తువులు, ధాన్యం లేదా భూమి విక్రయిస్తే బిల్స్, డాక్యుమెంట్స్ చూపించాలి. లేదంటే పోలీసులు సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిశాక ఆధారాలు చూపితే తిరిగి ఇస్తారు.

– ఎన్నికల కోడ్.. పోలీసుల విస్తృత తనిఖీలు

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పీవీ మార్గ్, ఐమ్యాక్స్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా భారీగా డబ్బు పట్టుబడితే సీజ్ చేస్తున్నారు. వనస్థలిపురంలో రూ.4 లక్షలు పట్టుకున్నారు. గచ్చిబౌలిలో కుక్కర్లు పంపిణీ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు..

*ఎల్బీనగర్ చైతన్య పురి పిఎస్ పరిధిలో వాహనాల తనిఖీల్లో భారీగా డబ్బులు*

_చైతన్య పురి పీఎస్ పరిధిలోని.

_ఎన్నికల కోడ్ నేపథ్యంలో SOT ఎల్బీనగర్_ *వాహనాల తనిఖీల్లో భాగంగా ఎలాంటి అనుమతులు లేని 30 లక్షల రూపాయలు , ఒక యక్టీవ్ బైక్ స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించిన SOT పోలీసులు..*

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా చైతన్య పురి పోలీసులు..

*సూర్యాపేట జిల్లా*

మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు.

ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న మూడు లక్షల 90 వేల రూపాయలు పట్టుకున్న పోలీసులు.

డబ్బులను సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు…