మద్యం మత్తులో…యువతుల స్ట్రీట్ ఫైట్…!!!

రోడ్డుపై ఒకపుడు మగాలు మాత్రమే కొట్టుకునేవారు. కానీ ఇపుడు ట్రెండ్ కాస్త మారింది. స్ట్రీట్ ఫైట్ కు మహిళలు సైతం దిగుతున్నారు. అక్కడక్కడా రోడ్ల మీద జనాలు కొట్టుకోవడం మామూలే.

చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద గొడవల దాకా.. ఆడా మగా తేడా లేకుండా తన్నుకోవడాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి కూడా. స్మార్ట్ కెమెరా ఫోన్లు పెరిగిపోయాక ఎక్కడ ఇలాంటివి జరిగినా వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ఆ వెంటనే వైరల్ గా మారడమూ పెరిగింది. అలా ఓ ఇద్దరు అమ్మాయిలు ఇష్టమొచ్చినట్టుగా కొట్టుకున్న ఓ వీడియో తాజాగా వైరల్ గా మారింది.ఇది ఎక్కడో మనకు తెలియదు.సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో.

ఏదో ఒక రోజు రాత్రి పూట యువతులు కొట్టుకున్న వీడియో ఇది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వారు జుట్లు పట్టుకుని మరీ దాడి చేసుకున్నారు. అటువైపుగా వాహనాలు వస్తున్నా వారు ఆగలేదు. చుట్టూ ఉన్న కొందరు చూస్తూనే ఉన్నారుగానీ.. వారిని ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. వారిలో ఒక యువతి అయితే మరో అమ్మాయి జుట్టు పట్టుకుని బలంగా కడుపులో తన్నడం కూడా మొదలుపెట్టింది. దీనంతటినీ ఎవరో వీడియో తీశారు.

కేవలం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్ లోని ‘వీసియస్ వీడియోస్’ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి వేల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి.

‘ఇది మరీ ఘోరం. ఇంతగా కొట్టుకున్నది ఏ విషయం మీదనో’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘వీకెండ్ పార్టీ మత్తులో విచ్చలవిడిగా కొట్టుకుంటున్నారు..’ అని కొందరు పేర్కొంటున్నారు. ‘వారి వస్త్రాలు, చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే.. అదేదో యూరోపియన్ దేశంలో జరిగినట్టుగా ఉంది..’ అని ఓ నెటిజన్ పేర్కొంటే.. ‘దేశం ఏదైనా కొట్టుకునేవారిని అంతా గుమిగూడి చూస్తుండటం కామనే..’ అని మరో నెటిజన్ స్పందించారు.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో