ఇద్దరు అమ్మాయిలు ‘మోహే రంగ్ లగాడే’ అనే బాలీవుడ్ సాంగ్‌కు ఒకరి మీద మరొకరు పడుతూ ఫుల్ రొమాన్స్..!!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రమైన పనులన్ని చేస్తున్నారు. కొందరూ బైక్లపై స్టంట్లు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరికొందరు మాత్రం..వల్గర్ పనులు చేసి, రొమాన్స్ వంటి పిచ్చి చేష్టలతో వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. మొన్నటి వరకు అబ్బాయిలు, అమ్మాయిలు భరితెగించి బైక్ పైనే రొమాన్స్ చేసిన

https://twitter.com/Mohd_Aqib9/status/1772076965710684376?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1772076965710684376%7Ctwgr%5E737421ff6312ee15e47169743677808774fd2fed%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కానీ.. తాజాగా అమ్మాయి, అమ్మాయి కలిసి రోడ్డు మీద రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ఓ వ్యక్తి స్కూటీ నడుపుతున్నాడు. అతడి వెనుకాల ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అతడు బైక్ నడుపుతుంటే.. వెనుకున్న ఇద్దరు అమ్మాయిలు ‘మోహే రంగ్ లగాడే’ అనే బాలీవుడ్ సాంగ్‌కు ఒకరి మీద మరొకరు పడుతూ ఫుల్ రొమాన్స్ చేస్తున్నారు. అంతే కాకుండా వాళ్లు ముఖాలు మొత్తం రంగులతో నిండి ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఛీ ఇదేం కర్మరా బాబు’ అని ‘ఇలాంటి వాటిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని’ తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు..అయితే.. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో ఇది పోలీసుల దృష్టికి కూడా చేరింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు వారిపై రూ. 33 వేలు ఫైన్ విధించారు. ఈ విషయాన్ని తెలుపుతూ నోయిడా ట్రాఫిక్ పోలీసులు X వేదికగా మోటర్ వెహికల్ యాక్ట్ కింద రూ. 33 వేలు ఛాలానా జారీ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ఇకపై ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయిన, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు..