విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘లైగర్’ రిలీజ్ డేట్‌‌పై రేపే అప్‌డేట్…

విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘లైగర్’ రిలీజ్ డేట్‌‌పై రేపే అప్‌డేట్..

కొద్ది రోజుల క్రితం చిత్రం టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన మూవీమేకర్స్..
రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ఛార్మి, అన‌న్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు..

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఆగస్టు 25, 2022లో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇక అది అలా ఉంటే విజయ్‌తో పూరి మరో సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్‌ ప్రియమైన ప్రాజెక్టు ‘జనగనమణ’ను విజయ్ హీరోగా తెరకెక్కించాలనీ చూస్తున్నాడని టాక్. అయితే ఇదే కథతో గతంలో హీరో మహేష్ బాబుతో తీయాలని ప్రయత్నించారు పూరీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సొసైటీ మీద, పోలిటిక్స్‌పై ఈ కథ సాగుతుందట. ఈ సినిమాలో కీలకపాత్రలో హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారని అంటున్నారు. అంతేకాదు విలన్‌గా అజయ్ దేవగన్‌ తీసుకోవాలనీ పూరి భావిస్తున్నారట. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ఫైనల్ అయ్యిందని, కరణ్ జోహార్ ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారని.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలకానుందట. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయో..