భారీగా పెరిగిన బంగారం ధరలు
వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹1,140 పెరిగి ₹98,400కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹1050 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.1,17,700గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
లైంగిక వేధింపుల నివారణకు కమిటీలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ కోసం కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి మాట్లాడారు. వారం రోజుల్లో జిల్లా, మండల స్థాయి కార్యాలయల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి వారం రోజుల్లో సంక్షేమ అధికారి కార్యాలయంలో వివరాలు సమర్పించాలన్నారు..
42కు చేరిన పాశమైలారం మృతుల సంఖ్య
TG: పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. మరణాలు 55 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న NDRF, SDRF, హైడ్రా, ఫైర్ సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువగా ఏపీ, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్కు చెందిన వారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు..
ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒహాయో నగరంలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో నలుగురు ప్రయాణికులు కాగా.. ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
పాశమైలారం ప్రమాదం.. తక్షణ సాయం ప్రకటించిన సీఎం
TG: పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటనలో 40మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.
మృతుల కుటుంబాలకు CM రేవంత్ రెడ్డి రూ. లక్ష చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున తక్షణసాయం ప్రకటించారు. పరిహారం విషయమై కంపెనీ ఏం నిర్ణయం తీసుకుందో చెప్పాలని CM అధికారులను ప్రశ్నించారు. మరోవైపు, నిన్న మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే..
*శివకాశిలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురి సజీవ దహనం*
మరికొందరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
తమిళనాడులోని శివకాశిలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా టపాసుల తయారీకి కేంద్రంగా ఉన్న శివకాశిలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా రసాయనాల మిశ్రమంలో జరిగిన పొరపాటు వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శివకాశిలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది..
*భారీ వరదలు.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార*
హరియాణాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు యమునానగర్ ఉన్న ఆసియాలోనే అతిపెద్ద సరస్వతి షుగర్ మిల్లోకి నీరు ప్రవేశించింది. ఫలితంగా సుమారు రూ.50 నుండి రూ.60 కోట్ల విలువైన పంచదార కరిగిపోయిందని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వలో సుమారు 40 శాతం నష్టం వాటిల్లింది. గోదాంలో రూ.97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదార ఉండగా, తుది నష్టం మొత్తం గోదాంను పరిశీలించిన తరువాతే తెలుస్తుందన్నారు…
*🔹నిజామాబాద్ తెరుచుకున్న బాబ్లీ గేట్లు*
_• 14 గేట్లు ఎత్తివేత_
_• తెలంగాణ మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల సమక్షంలో ఓపెన్ చేసిన జలసంఘం ప్రతినిధులు._
*• అక్టోబర్ 30 వరకు గేట్లు తెరిచి ఉంచనున్న మహారాష్ట్ర.*
_• ఎస్సారెస్పీ లోకి పెరగనున్న ఇన్ ఫ్లో.
బిల్లు పాసైతే కొత్త పార్టీ పెడతా: మస్క్.
బిలియనీర్ ఎలాన్ మస్క్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్పై మరోసారి విమర్శలు గుప్పించారు. ట్రంప్ తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ దారుణమైందని, అది అమల్లోకొస్తే ట్యాక్స్ పేయర్స్పై చాలా భారం పడుతుందన్నారు. ఒకవేళ బిల్లు సెనేట్లో పాసైతే తాను తర్వాతి రోజే కొత్త ‘అమెరికా పార్టీ’ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు మేలు చేసే కొత్త పార్టీ అవసరమని ట్వీట్ చేశారు.