నేటి ప్రధాన ముచ్చట్లు..

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం.

రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన శోభాయాత్ర
సంప్రదాయ మేళతాళాలతో గణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్ వినాయకుడికి భారీ గజమాల వేసిన ఉత్సవ కమిటీ
టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా..
ట్యాంక్‌ బండ్‌ వరకు చేరుకోనున్న శోభాయాత్ర
శోభాయాత్రకు భారీగా తరలివస్తున్న భక్తులు
ఖైరతాబాద్‌ వినాయకుడి వాహనం చుట్టూ రోప్ పార్టీ

గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీ. మేర శోభాయాత్రలు
నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందోబస్తు.

20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు..నిమజ్జనాల దృష్ట్యా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,531 మంది భక్తులు..శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు

తిరుపతి: చంద్రగిరి మండలం అగరాల దగ్గర రోడ్డుప్రమాదం

గ్రానైట్ లారీని వెనుక నుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు
30 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

*🔹గణేష్‌ నిమజ్జన ఘట్టం ప్రారంభం*

ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న బొజ్జ గణపయ్యలు..

బాలాపూర్‌ గణపతికి చివరి పూజ..

ఉదయం 10 గంటలకు లడ్డూ వేలం..

కాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర..

ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు..

రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లకు వినాయక లడ్డూ వేలంపాట

హైదరాబాద్ రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూను వేలంలో రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలకు దక్కించుకున్న కమ్యూనిటీ సభ్యులు..

కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్‌రావు

నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం..కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారు
కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా..
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం..కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తాం- అన్నారు .

నిర్మల్: DJ శబ్దాలతో నలుగురు పిల్లలకు అస్వస్థత
భైంసా పిప్రికాలనీలో గణేష్ శోభాయాత్రలో DJ ఏర్పాటు
నలుగురు పిల్లలకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ పర్యటనలో మంత్రి వాకిటి శ్రీహరి
కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయతో వాకిటిశ్రీహరి భేటీ

తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించాలని వినతి
క్రీడాపాఠశాలలకు నిధులుఇవ్వాలని కోరిన మంత్రి వాకిటి

అనకాపల్లి: చోడవరం సబ్ జైలునుంచి ఇద్దరు ఖైదీల పరారీ
సిబ్బందిపై దాడి చేసి పారిపోయిన రిమాండ్‌ ఖైదీలు
రిమాండ్‌ ఖైదీలు రవికుమార్, రాము కోసం గాలింపు
హెడ్‌ వార్డర్‌పై సుత్తితో దాడిచేసి..
తాళాలు తీసుకొని పారిపోయిన ఖైదీలు
పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో నిందితుడు రవికుమార్
చోరీ కేసులో నిందితుడిగా ఉన్న బెజవాడ రాము

.కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్‌
జిల్లాల్లో యూరియా నిల్వలు, పంపిణీపై మంత్రి ఆరా..
యూరియా సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలని ఆదేశం..
యూరియా నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సూచన..
యూరియా నిల్వల వివరాలను అందజేయాలని ఆదేశం..

HYD: వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం..

DGP, మేయర్‌, సీపీతో కలిసి ఏరియల్‌ వ్యూలో పరిశీలన..
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోంది-పొన్నం
అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి
2 లక్షలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది
రాత్రి వరకు నిమజ్జనాలు పూర్తవుతాయి అన్నారు..

శ్రీశైలం డ్యామ్‌ గేట్లు మరోసారి ఎత్తిన అధికారులు.

ఈ సీజన్‌లో ఐదోసారి గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం ప్రాజెక్ట్ ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తివేత..

ప్రస్తుత నీటిమట్టం 884.1 అడుగులు
ప్రస్తుత నీటి నిల్వ 210.5 టీఎంసీలు
కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి.

ఏపీ లిక్కర్‌ కేసు నిందితులకు బెయిల్‌
ధనుంజయ్‌, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్పకు బెయిల్‌..

బెయిల్‌ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశం
..

మే 13న అరెస్టయిన బాలాజీ గోవిందప్ప
మే 16న అరెస్టయిన ధనుంజయ్‌, కృష్ణమోహన్‌రెడ్డి..

లిక్కర్‌ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్‌
అరెస్టయిన నిందితుల్లో ఇప్పటివరకు నలుగురికి బెయిల్‌..

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు..

చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్
రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ లభ్యం
32 వేల లీటర్ల రా మెటీరియల్‌ స్వాధీనం
13 మందిని అరెస్ట్‌ చేసిన మహారాష్ట్ర పోలీసులు
తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్‌ గుట్టురట్టు..ఫ్యాక్టరీలో పెద్దఎత్తున ఎండీ డ్రగ్స్‌ తయారీ..దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తింపు..కెమికల్‌ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్‌ తయారీ..బంగ్లాదేశీ మహిళ అరెస్ట్‌తో బయటపడ్డ డ్రగ్స్ గుట్టు..

ముంబైలో డ్రోన్లపై నిషేధం

నిమజ్జనం, దసరా నవరాత్రుల సందర్భంగా..
డ్రోన్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లపై బ్యాన్‌.