లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

ఈ నెల 21న శ్రీనగర్ కు ప్రధాని మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్ లో పర్యటిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. శ్రీనగర్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి దాదాపు 9000 మంది యోగా చేస్తారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లోని 20 జిల్లాల ప్రజలను వర్చువల్ గా కనెక్ట్ చేస్తామని, దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు కశ్మీర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు..

అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన జవాను శత్రుఘ్న విశ్వకర్మగా గుర్తించారు..

రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసిన ఎస్సై

తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్

భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు.

ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడు.

తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.

చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే “బాబన్న (శ్రీధర్ బాబు) బావున్నాడా.. నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు” అంటూ మాట్లాడేవాడు.

ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్ సెంటర్ నుండి పావుకిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేశాడు.

ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను ఎవరినీ వదలకుండా రూ. 100 కూడా వదలకుండా వసూళ్లకు పాల్పడేవాడు..

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌

రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం..

*జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరణ*

*అమరావతి..

జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలు అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు.

పవన్ కళ్యాణ్ విజయవాడ నీటిపారుదన శాఖ గెస్ట్ హాస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాాగ్రి వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. దాదాపు పదేళ్ల పాటు నిరీక్షణకు నేడు తెరపడింది. దీంతో జనసేన కార్యకర్తలు పవర్ స్టార్ అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు అధికారులతో భేటి కానున్నారు..

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్‌ షర్మిల
రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు..

చిరంజీవి కూతురుశ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ మృతి..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఈరోజు మృతి చెందారు.

గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సినీవర్గాలు తెలిపాయి.

శ్రీజ కొణిదెల 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకోగా.. 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2019లో శిరీష్ మరో పెళ్లి చేసుకున్నారు…

ఈనెల 24న ఏపీ మంత్రివర్గ సమావేశం..

అమరావతి:జూన్ 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది.

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది.

ఈ సంద్భంగా ఈ నెల 21 సాయంత్రం 4 గంటల్లోగా కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలను పంపించా లని ప్రభుత్వ శాఖలు ఆదేశాలు అందాయి.

కాగా ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశా లు జరగనున్నాయి…

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి?

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్టు తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు బుచ్చయ్యచౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ దగ్గర ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయను న్నారు. అనంతరం ఎల్లుండి శాసన సభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించను న్నట్టు తెలుస్తుంది.

సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంత రం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించను న్నారు.

స్పీకర్‌ పదవికి మరో సీని యర్‌ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 22, 23 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది…

*రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్*

గుంటూరు, రైలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని మంగళవారం గుంటూరు జిఅర్ పి పోలీసులు అరెస్ట్ చేసారు.

ఎస్ ఐ వేంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం పేరేచర్లకు చెందిన రవికుమార్, సాంబయ్య ఇద్దరు హైదరాబాద్ కు వెళ్లి తెలంగాణా మద్యం తీసుకుని రైలులో గుంటూరుకి చేరుకున్నారు.

ఎస్ ఐ తమ సిబ్బందితో రైల్వేస్టేషన్ లో తనిఖీలు చేయగా ఇద్దరి బ్యాగులో 40 తెలంగాణా మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులిటెన్ విడుదల చేసింది. రాహుల్ వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని, వయనాడ్ ఎంపీగా ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభించినట్లు పేర్కొంది. మరోవైపు వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు..

*ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి*

బీహార్ లోని అరారియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి సిక్తిలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా.. అంతకుముందే కోట్లతో నిర్మించిన వంతెన కూలిపోయింది.సిక్తి బ్లాక్‌లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు. మంగళవారం వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది.

*స్వర్ణ పథకం సాధించిన నీరజ్ చోప్రా*

టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విజేత, భార‌త స్టార్ జావె లిన్ త్రోయ‌ర్‌ నీర‌జ్ చోప్రా పావో నుర్మి గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు.

ఫిన్‌లాండ్‌లో జ‌రిగిన టోర్నీ లో జావెలిన్‌ను ఏకంగా 85.97 మీట‌ర్లు విసిరి స‌త్తా చాటారు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో త‌న మూడో ప్ర‌య‌త్నంలో నీర‌జ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకున్నారు.

ఇక నీర‌జ్‌కు ఈ సీజ‌న్‌లో ఇది మూడో ఈవెంట్‌. గాయం బారిన ప‌డ‌కూడ‌ ద‌నే ముందు జాగ్రత్త కారణంగా గత నెలలో చెకియాలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్‌కు అత‌డు దూరమయ్యాడు.

కాగా, పారిస్ ఒలింపిక్స్ ముందు నీర‌జ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రోసారి ప‌త‌కంపై భార‌త్ ఆశ‌ల‌ను పెంచేసింది…