లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లను దయచేసి విడుదల చేయాలి – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి….

2014లో 1400 రైతుల ఆత్మహత్యలు జరిగితే వాటిని తగ్గించుకుంటూ 2023 నాటికి 134కు తెస్తే కాంగ్రెస్ వాళ్ళు మళ్లీ 564 రైతుల ఆత్మహత్యలకు పెంచారు..భట్టి విక్రమార్కకు ఛాలెంజ్ విసిరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు..

నా నియోజకవర్గంలో ఉన్న 127 గ్రామాల్లో ఏదైనా ఒక గ్రామానికి పోదాం, 100 శాతం రుణ మాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి

నియోజకవర్గాల్లో సమస్యలున్నాయని తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. నా నియోజకవర్గంలోను సమస్యలున్నాయని జవాబిచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు

కాంగ్రెస్ ప్రభుత్వం మనఊరు – మనబడి కార్యక్రమానికి నిధులు విడుదల చేయక, జనగామ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులు చందాలు వేసుకొని షెడ్డు వేసి పాఠాలు చెబుతున్నారు – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సమస్యలు మీ నియోజకవర్గంలోనే కాదు నా నియోజకవర్గంలోను ఉన్నాయి అన్నారు..

వరి పంట బోనస్ అందరికీ ఇవ్వలేదని ఒప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

వరి పంట బోనస్‌కు సంబంధించి రూ.250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి. త్వరలోనే చెల్లిస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు..

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు తరలిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల వాటా కోసం పోరాడుతున్నామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు, అది నిజమైతే ఇప్పటివరకు నాగార్జున సాగర్ ఎందుకు తెలంగాణ రాష్ట్ర అధీనంలోకి రాలేదు ? అన్నారు… చర్చ జరుగుతున్న సమయంలో
మండలి సభ్యులను ఉద్దేశించి సభలో గౌరవ చైర్మన్ గారు న్యూసెన్స్ అనే పదం వాడడం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు..

కేసీఆర్‌ మార్చురిలోకి పోతాడని నేను అనలేదు.. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నాను.. సిఎం రేవంత్ రెడ్డి..

అంత కుంచిత స్వభావం నాకు లేదు ⁠- రేవంత్ రెడ్డి.
…
కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉంది.. అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నాడు అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు..

తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే సభకు రాకుండా కేసీఆర్‌(KCR) మొహం చాటేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు..శనివారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సమాధానమిస్తూ.. మాజీ సీఎంతో పాటు హరీష్‌, కేటీఆర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్‌ బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి అన్నారు. ”తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు మాటకు ముందు స్టేచర్‌.. మాటకు తర్వాత స్టేచర్‌ అంటున్నారు. మరి మీకు స్టేట్‌ ఫ్యూచర్‌ వద్దా.. మీ స్టేచరే మీకు ముఖ్యమా? అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు..కేసీఆర్‌ దగ్గర ఇప్పుడు మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమే. ఆ సీటుతో నేనేం చేసుకుంటాం. అది హరీశ్‌కో, కేటీఆర్‌కో కావాలి మాకు కాదు. కేసీఆర్‌ను ఉద్దేశించి నేను ‘స్ట్రెచర్‌’ వ్యాఖ్యలు చేశానని హరీష్‌, కేటీఆర్‌ చిత్రీకరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నాను.. అందులో తప్పేం ఉంది. కేసీఆర్ చెడును నేను ఎందుకు కోరుకుంటా?. ఆయన వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే అధికారంలో ఉండాలి. కేసీఆర్‌ సభకు రావాలి. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించం. ఆయన సభకు వచ్చిననాడే కృష్ణా జలాల అంశం చర్చ పెడతాం” అని రేవంత్‌ స్పష్టం చేశారు..

సోషల్ మీడియాలో పోస్టులపై సిఎం రేవంత్ సిరియస్.. హద్దు దాటితే కఠిన చర్యలు..

సీఎం రేవంత్ ప్రసంగంలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులపై కన్నెర్రజేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సోషల్‌ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా.. కాదు అంటే.. ఒక్కడు బయట తిరగలేడు.. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా?.. హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు.. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి.. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతా. తొడ్కలు తిస్త. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఈ సంస్కృతి విష సంస్కృతి. నన్ను తిట్టిన తిట్లకి.. మీ పేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్న. కాదు అంటే.. ఒక్కొక్కడు బయట తిరగడు. కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. హద్దు దాటితే .. ఊరుకోను ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తది అనుకుంటున్నారు. అవసరం ఐతే చట్టాన్ని సవరిస్తాం. ఆడ పిల్లలు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఏం బాగుంటుంది. ఇవి వింత పోకడలు. కేసీఆర్.. మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతర వేస్తా. సమస్యలు.. తప్పులు చెప్పండి. సరిదిద్దికుంటం. మీడియా సంఘాలు చెప్పండి. కుర్చీలో ఉన్న అని.. ఊరుకుంటారు అనుకుంటున్నారు. చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. విశ్రుకలత్వం ఆపండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బ తీస్తారు. చట్ట సభలో చట్టం చేద్దాం. నా ఒక్కరి ఆవేదన కాదు.. అందరి ఆవేదన. అందరూ సహకరించాలి. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి.” అని సీఎం రేవంత్ ప్రసంగించారు.

వరి పంట బోనస్ అందరికీ ఇవ్వలేదని ఒప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి .

వరి పంట బోనస్ అందరికీ ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. వరి పంట బోనస్‌కు సంబంధించి రూ.250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయని, త్వరలో చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన మంత్రి, రైతులకు బకాయిల చెల్లింపు గురించి హామీ ఇచ్చారు.

జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయం.. మాజీ మంత్రి హరీష్ రావు.

సభలో ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్‌(KCR) చెబుతుండేవారని, ఆ మాటను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) అంటున్నారు..శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. తమ పార్టీ నేత జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎ‍త్తివేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన.

”స్పీకర్‌ అంటే జగదీష్‌రెడ్డికి, మాకు ఎంతో గౌరవం ఉంది. సభలో హుందాగా ఉండాలని మా అధినేత చెబుతుండేవారు. మేం అలాగే ఉంటున్నాం. స్పీకర్‌ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. జగదీష్‌రెడ్డికి మైక్‌ ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా ఆయన స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదు. కాబట్టి జగదీష్‌రెడ్డి(jagadish Reddy)పై సస్పెన్షన్‌ వేటు ఎత్తేయాలి” అని హరీష్‌ రావు స్పీకర్‌ను కోరారు.

అంతకు ముందు.. సభ ప్రారంభానికి ముందు స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కలిసిసింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయన్న బీఆర్‌ఎస్‌ సభ్యులు.. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, చివరకు సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి.. నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు..

సీఎం రేవంత్ కు మీనాక్షి సంచలన ఆదేశాలు!

మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రులను తప్పించాలని ఆమె డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వారి పనితీరుపై మీనాక్షి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా మంత్రుల పనితీరుపై పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే మీనాక్షికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలకు ఛాన్స్..

దీంతో ఆమె కూడా క్షేత్ర స్థాయి నుంచి వివరాలు తెప్పించుకున్నట్లు గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. స్థానిక నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులకు సమన్వయమే లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ఇంఛార్జ్ మంత్రులు కనబడుతున్నారంటూ మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులను తప్పించాలని సీఎంకు మీనాక్షి ఆదేశాలు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించాలని సూచించినట్లు సమాచారం. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయా జిల్లాలకు ఇన్ఛార్జ్లుగా నియమించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.