*ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు..*
*ఇక ఆఫీస్ బయట పడిగాపులు అవసరం లేదు…*
ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందుస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది.
మొన్నటి వరకు భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది.
అయితే ఇప్పుడు వెయిటింగ్ చేయకుండా రిజిస్ట్రేషన్ సమయానికి వెళ్తే సరిపోతుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చెలరేగిన మంటలు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద సాయంత్రం 6:00 గంటల సమయంలో అంటుకున్న మంటలు
సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులో తెస్తున్న ఫైర్ సిబ్బంది
సుమారు 50 నుంచి 100 ఎకరాల వరకు అగ్నికి ఆహుతయిన వృక్ష సంపద..
ఎర్ర సముద్రంలో మునిగిపోయిన 2300 టన్నుల జలాంతర్గామి, ఆరుగురు దుర్మరణం!
ఈజిప్టులో భారీ ప్రమాదం సంభవించింది. హుర్‌ఘడ నగరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో పర్యాటక జలాంతర్గామి మునిగిపోచింది.
ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. 14 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించింది..
కిలో రూ.3.. కష్టాల్లో టమాటా రైతులు
TG: గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు నర్సింహులు 56 టమాటా పెట్టెలు(ఒక్కోదాంట్లో 30kg) మహబూబ్‌నగర్ రైతుబజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తూ ఆవేదన చెందారు. మరోవైపు, బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.10- రూ.20 వరకు ఉంది…
రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువ మాట్లాడితే మాకు అంత మంచింది.. రేవంత్ రెడ్డి తిట్లే మాకు దీవెనలు.. కేటీఆర్.
రేవంత్ రెడ్డి తిట్ల వల్ల ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది
రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో, హర్యానాలో, ఢిల్లీలో వెళ్లి ఎన్నికల ప్రచారాలు చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాలు చేశాడు. అద్భుతాలు సాధించాడు అంటూ ఎద్దేవ చేసేరా..నువ్వు ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా
నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి డ్రోన్ పంపిస్తే ఊరుకుంటావా.. అక్కడ నీ బిడ్డనో, భార్యనో ఉంటే వాళ్ళను ఇష్టం ఉన్నటు ఫోటో తీస్తే ఊరుకుంటావా?
మీ కాడికి వచ్చేసరికి కుటుంబాలు, భార్యాపిల్లలు.. వేరే వాళ్లకు భార్యాపిల్లలు లేరా, ఆ రోజు మా ఇంట్లో మైనర్ పిల్లలను బూతులు తిట్టింది మీరు కాదా?
జైలుకు ప్రభుత్వాలు పంపవు.. కోర్టులు పంపుతాయి, దాని మేము ఏం చేయగలము
నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగలరు అని ముఖ్యమంత్రి బయపెట్టాలని చూస్తున్నాడు.. నువ్వు ఏం అనుకున్న ఫరక్ పడదు – కేటీఆర్….
డ్రోన్ ఎగరేసినందుకు రూ.500 ఫైన్ వెయ్యాలి కానీ నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.. CM రేవంత్ రెడ్డి..
మామూలుగా 7 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే రిమాండ్‌కు పంపకుండా, బెయిల్ ఇవ్వాలి.. కానీ అధికారాన్ని అడ్డుబెట్టుకొని నన్ను చర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో వేశారు
16 రోజులు ఒక్కమనిషిని చూడకుండా నన్ను నిర్బంధించినా.. ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ పనిచేస్తున్నా
నన్ను పడుకోనివ్వకుండా చేయడానికి ట్యూబ్ లైట్లు బంద్ చెయ్యకపోతే.. 20, 30 పెద్ద పెద్ద బల్లులు పురుగులు తింటుంటే ఒక్కరోజు కూడా నేను నిద్ర పోలేదు
సెల్లో చిన్న బాత్ రూమ్ లో కూర్చుంటే బైటకి కనిపించే లాగా ఉంటుంది.. కావాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకువెళ్లి చూపిస్తా
16 రోజులు నిద్ర లేకపోతే.. పొద్దుగాలా బైటకి వదిలినప్పుడు చెట్టు కింద పడుకొని నిద్రపోయేవాడిని అన్నారు..
ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం.
ఇప్పటివరకు ఒక బ్యాంకు ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు. ఇక నుంచి మనం గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)కు కూడా వర్తిస్తుంది.
ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుకు మెజారిటీ ఓట్లు లభించాయి. అంతకుముందు 2024 డిసెంబరులో ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. లాకర్ల విషయానికి వస్తే.. వాటికి పాత పద్ధతిలోనే ఒకరికి మించి నామినీలను పెట్టుకోవచ్చు. అయితే వారికి ప్రయారిటీని నిర్ణయించుకోవాలి.
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024లోని కీలక అంశాలివీ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిధిలోని బ్యాంకులు ఇప్పటివరకు ప్రతీ రెండో శుక్రవారం, నాలుగో శుక్రవారంలలో ఆర్బీఐకు రిపోర్టింగ్ చేసేవి. అవి ఇక నుంచి ప్రతినెలా 15న, 30న రిపోర్టింగ్ చేయాలి.
ప్రభుత్వం వద్ద నమోదైన కంపెనీలలోని డైరెక్టర్ల కనీస వాటా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. డైరెక్టర్ హోదాలో ఉన్నవారు కంపెనీలోని 10 శాతం ఈక్విటీని కలిగి ఉండొచ్చు.
సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు.
కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా(Bank Account Nominees) ఉండేవారు, రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులోనూ సభ్యుడిగా వ్యవహరించొచ్చు.
ఆడిటర్లకు వేతనాల చెల్లింపులో బ్యాంకులకు స్వేచ్ఛను కల్పించే నిబంధన సైతం సవరించిన చట్టంలో ఉంది.
రుణాల ఎగవేతదారులపై నిర్మల కీలక వ్యాఖ్యలు..
ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టే వాళ్లను వదిలేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. వాళ్ల నుంచి అప్పులను వసూలు చేసేందుకు బ్యాంకులు తగిన చర్యలు చేపడతాయని స్పష్టం చేశారు. బ్యాంకుల అప్పులను ‘రైట్ ఆఫ్’ చేయడం అంటే మాఫీ చేసినట్టు కాదన్నారు. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిర్మల ఈ వివరాలను వెల్లడించారు.
Chandra Babu Visits Polavaram Project: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి – కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు చంద్రబాబు.
పనులు జరుగుతున్న తీరుపై ప్రాజెక్టు వద్దే అధికారులతో సమీక్ష జరిపారు.
పోలవరం నిర్వాసితులతో కూడా చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
నిర్వాసితులకు రూ.829 కోట్లు నేరుగా అందజేశామని మరికొంత నిధులు అందజేస్తామని వెల్లడించారు.
పోలవరంలో నీళ్లు పారడానికి ముందే అంటే 2027 నవంబర్ నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామనని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని మండిపడ్డారు.
నిర్వాసితులకు భారీగా హామీలు ఇచ్చిన జగన్ వాటిని కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు అలాంటి భయం లేదని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు.
గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు..
ఈశాన్య ఫ్రాన్స్‌లోని సెయింట్-డిజియర్ సమీపంలోని ఎయిర్‌బేస్‌లో ఆరు ఆల్ఫా జెట్లతో విన్యాసాలు జరిగాయి.
ఇందులో ఆరు విమానాలు పాల్గొనగా రెండు విమానాలు ఢీకొని, సమీప ఫ్యాక్టరీలో పడటంతో మంటలు చెలరేగాయి.
ఒక పైలెట్‌కు తీవ్ర గాయాలు, మరొకరు, ఒక ప్రయాణికుడు అపస్మారక స్థితిలోకి వెళ్లారు…..