పాఠ‌శాల‌పై పిడుగు..17 మంది విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు

దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ (weather Department) వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తాజాగా ఓ పాఠశాలపై పిడుగు పడి (Lightning strike) 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఒడిశా(Odisha)లోని కేంద్రపడ జిల్లాలో చోటుచేసుకుంది…

ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలోని గరద్‌పూర్‌లో పాఠశాలపై పిడుగు పడింది. విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు వస్తున్న సమయంలో పిడుగు పడింది..ఈ ప్రమాదంలో 17 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరూ 6, 7వ తరగతి విద్యార్థులు. గాయపడిన విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిలో 9 మంది విద్యార్థులను కేంద్రపడ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.