మద్యం మత్తులో చిల్లర వేషాలు..స్వామి వివేకానంద విగ్రహం ధ్వంసం

మద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసిన యువకుడు

శ్రీకాకుళం – పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.

గోప్యంగా ఉంచిన ప్రభుత్వ పాఠశాల సిబ్బంది. విగ్రహాన్ని ఎవరికీ కనబడకుండా దాచేసిన ప్రభత్వ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విగ్రహ ధ్వంసం.

వీడియో వైరల్ కావడంతో జనసేన నాయకులు దాడి చేసిన విగ్రహాన్ని వెలికి తీసి అల్లరి మూకల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్..