మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు 100 కోట్లు ఖర్చు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ….!! ఎన్ని వచ్చాయి అంటే..!!

మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు 100 కోట్లు ఖర్చు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ..

ఏపీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణలో మద్యం దుకాణాల కోసం 5,000 దరఖాస్తులు వేసి ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసి లక్కీ డ్రాలో 110 పైగా మద్యం దుకాణాలు దక్కించుకుంది….
తెలంగాణలో 2023-2025 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇటీవల మద్యం దుకాణాల లైసెన్సులకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. దాఖలైన టెండర్ల నుంచి లక్కీ డ్రా నిర్వహించి మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వ అధికారులు అప్పగించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏపీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ మద్యం టెండర్లలో అత్యధిక దరఖాస్తులు దాఖలు చేసి భారీ స్థాయిలో షాపులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. తెలంగాణలో మద్యం వ్యాపారంలో అడుగుపెట్టేందుకు 5వేలకు పైగా టెండర్లు దాఖలు చేసింది. లక్కీ డ్రాలో సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు 110 షాపుల లైసెన్సులు సొంతమైనట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో మద్యం వ్యాపారం తీరును లోతుగా పరిశీలించిన ఆ కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శంషాబాద్, సరూర్ నగర్ జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలకు గిరాకీ ఎక్కువగా ఉందని గ్రహించింది. దీంతో ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు భారీగా దరఖాస్తులను చేసింది…