చెరువులో ఈత కొట్టుకుంటూ వెళ్లి మరి,, విద్యుత్ మరమ్మతులు చేసిన లైన్మెన్ సాహసాన్ని చూసి అభినందించిన గ్రామస్తులు..!

సూర్యాపేట.. జిల్లా..

కుండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు… దానికి సజీవ సాక్ష్యమే ఈ ఉదంతం…. వివరాల్లోకి వెళితే
….
సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్ గ్రామంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది.. గ్రామ శివార్లలో ఉన్న చెరువు వద్ద వరద నీరు పారుతున్నది… ఇంతలోనే కరంట్ స్తంభం వైర్ తెగిపోయింది.. దింతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది…సమాచారం అందుకున్న విద్యుత్ హెల్ఫేర్ కొప్పుల సంతోష్‌ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద నీటిలో ఈదు కుంటూ వెళ్లి వైర్ తెగిన స్తంభం వద్దకు చేరుకున్నడు… వెంటనే స్తంభం ఎక్కి తెగిన వైర్ ను రిపేర్ చేసి ,గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాడు..జోరు వానలో ,వరద నీటిని సైతం లెక్కచేయక ధైర్యంగా, తన విధులను నిర్వర్తించిన సంతోష్ ను పాతర్ల పాడ్ గ్రామస్తులు అభినందిస్తున్నారు.. విద్యుత్ శాఖ పనితీరును, అంకిత భావాన్ని కొనియాడుతున్నారు ప్రజలు….