బాధ్యతతో వ్యవహరిస్తే లాక్‌డౌన్‌తో పనేంటి?* ..

R9TELUGUNEWS.COM.
మళ్లీ లాక్ డౌన్ అంటూ ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి…. ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది ఎవరి వల్ల వస్తుంది..?.. లాక్ డౌన్ కారణాలు ఏమిటి… మన అజాగ్రత్త వల్ల ప్రభుత్వాల్ని నిందిస్తే సరిపోదు…!
ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల అనవసర భయాలు అవసరం లేదని, ఈ ముప్పు నుంచి బయటపడాలంటే డబుల్‌ మాస్క్‌ను ధరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థతో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమూ ఎంతో ముఖ్యమని మరికొందరు చెబుతున్నారు. మనం కారు, విమానం, బస్సు ఇతర ఏ వాహనంలోనైనా ప్రయాణించినప్పుడు సామాజిక బాధ్యతని మాత్రం మరవొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కొవిడ్ సోకిన వ్యక్తిని కలిసి వస్తే వెంటనే పరీక్షించుకోవడం.. పాజిటివ్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇలా ప్రతిఒక్కరూ ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరిస్తే లాక్‌డౌన్‌ గానీ, ఎలాంటి ఆంక్షలు గానీ విధించాల్సిన అవసరమే ఉండదని చెబుతున్నారు..