దేశంలో మళ్లీ లాక్‌డౌన్….రెండు రోజుల పాటు లాక్‌డౌన్..!!!!!

r9telugunews..దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఒమిక్రాన్ వేరియంట్ మరింతమందికి సోకుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని ప్రచారం జరుగుతోంది….గుంపులుగా కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వల్ల ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోందని.. అందుకే రెండు రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టనుందనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూసివేయాలనే ఆదేశాలు రానున్నాయని టాక్ నడుస్తోంది. తిరిగి జనవరి 3వ తేదీ పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పున: ప్రారంభం కానున్నాయని సమాచారం. అయితే కేంద్రం లాక్‌డౌన్ విధిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఏది ఏమైనా కేంద్రం లాక్‌డౌన్ విధించినా, విధించకున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కారం..