గన్నవరం సభలో కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా – నారా లోకేష్..
ఇతర జిల్లాల్లో వైసీపీ కుక్కలు నా పాదయాత్ర పూర్తయిన తరువాత మొరిగేవి. కృష్ణా జిల్లా వైసీపీ కుక్కలు నేను జిల్లాలో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకున్నాయి” అంటూ ఎద్దేవా చేశారు.
“లోకేశ్ క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి అని వైసీపీ కుక్కలు మొరిగాయి. అమ్మ లాంటి అమరావతిని చంపేసిన ఈ కుక్కలకు నన్ను ప్రశ్నించే హక్కు ఎవడిచ్చాడు? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పుట్టిన గడ్డకి జగన్ అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టిన కుక్కలు మనకి నీతులు చెబుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. పార్టీ కోసం కష్టపడిన వారిని గుండెల్లో పెట్టుకుంటా. టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధించిన వారు కృష్ణా జిల్లా లో ఉన్నా విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తాం. చట్టాలు అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.
యువగళం పాదయాత్ర 191వ రోజుకు చేరడంతో గన్నవరం సభకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గన్నవరంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, మారిన సమీకరణాలతో బలనిరూపణకు గన్నవరం సభ వేదికగా మారింది… కోడెల నాని ఏక వచనంతో సంవాసించడంతోపాటు కచ్చితంగా ఆయన అడ్రయర్పై రోడ్డుమీద నిలబెడతానని చాలెంజ్ విసిరారు..